మీ Mobile లుక్ మొత్తాన్ని మార్చేసే 10 బెస్ట్ యాప్స్ ఇవి!
FacebookWhatsApp
10 best android launchers
మీ Android phoneలో మీ ఫోన్ తయారీ సంస్థ తయారు చేసిన launcher పొందుపరచబడి ఉంటుంది. దానికి బదులుగా అనేక శక్తివంతమైన ఆప్షన్ లను అందించే థర్డ్-పార్టీ లాంఛర్లని ఉపయోగించడం ద్వారా మీ ఫోన్లో మరిన్ని అద్భుతమైన సదుపాయాలు పొందొచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న అనేక శక్తివంతమైన లాంఛర్ల గురించి ఇప్పుడు చూద్దాం.
1.Activity Launcher
చూడడానికి స్టాక్ ఆండ్రాయిడ్ మాదిరిగా ఉంటుంది. యూజర్ ఇంటర్ ఫేస్ మొత్తాన్ని మనకు నచ్చిన విధంగా మార్పిడి చేసుకోవచ్చు దీంట్లో! ఆకర్షణీయమైన ఐకాన్ ప్యాక్‌లను ఇన్స్టాల్ చేసుకోవడం, అప్లికేషన్ డ్రాయర్ కాన్ఫిగర్ చేసుకోవటం వంటి అనేక సదుపాయాలు దీంట్లో ఉంటాయి.
2.AIO Launcher
మామూలు హోమ్ స్క్రీన్ బదులుగా వివిధ రకాల సమాచారం కనిపించేవిధంగా ఇది ఏర్పాటు చేస్తుంది. మీ హోమ్ స్క్రీన్ లో తాజాగా వచ్చిన ఎస్ఎంఎస్ లు, మిస్డ్ కాల్స్, మీడియా ప్లేయర్, మీ సిస్టమ్ కి సంబంధించిన అందుబాటులో ఉన్న రామ్, బ్యాటరీ, స్టోరీస్ వివరాలు, న్యూస్ ట్విట్టర్ వంటి సమాచారంతోపాటు టెలిగ్రామ్ ఇంటిగ్రేషన్ వంటివి కూడా దీంట్లో ఉంటాయి. ముఖ్యమైన సమాచారం మొత్తం ఒకే చోట చూడటం కోసం ఈ లాంఛర్ ప్రయత్నించవచ్చు.
3.APEX Launcher
ఇది కూడా చూడటానికి స్టాక్ ఆండ్రాయిడ్ మాదిరిగా ఉంటుంది. ఇది థీమ్ ఇంజిన్ సపోర్ట్ చేస్తుంది. సుదీర్ఘకాలంగా మార్కెట్లో ఉన్న ఈ లాంఛర్ ట్రాన్సిషన్ యానిమేషన్లు కస్టమైజ్ చేసుకోవడం, స్క్రోలింగ్ కస్టమైజేషన్ వంటి అనేక రకాల సదుపాయాలు అందిస్తుంది.
4.APUS Launcher
50 వేలకు పైగా వాల్ పేపర్స్‌ని ఇది కలిగి ఉండటంతోపాటు, భారీ మొత్తంలో థీమ్స్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. న్యూస్ ఫీడ్, అప్లికేషన్ డ్రాయర్ నుండి కొన్ని అప్లికేషన్లను దాచిపెట్టడం, కొన్ని యాప్స్ ఓపెన్ కాకుండా లాక్ చేసుకోవడం వంటి వివిధ రకాల సదుపాయాలు దీంట్లో లభిస్తాయి.
5.Evie Launcher
2016లో బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ గా నిలిచిన అప్లికేషన్ ఇది. మామూలుగానే హోమ్ స్క్రీన్‌తో పాటు, యూనివర్సల్ సెర్చ్, కస్టమ్ షార్ట్ కట్స్, అనేక పర్సనలైజేషన్ ఆప్షన్లు వంటివి ఇది అందిస్తుంది. ఐకాన్ సైజులు, అప్లికేషన్ డ్రాయర్ మనకు నచ్చినట్టు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
6.Hyperion Launcher
దీని యూజర్ ఇంటర్ ఫేస్ కూడా స్టాక్ ఆండ్రాయిడ్ లాంఛర్ లాగే ఉంటుంది. అయితే భారీ మొత్తంలో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. థర్డ్-పార్టీ ఐకాన్ల సపోర్ట్, ఐకాన్ షేప్ మార్చుకోవటం, గూగుల్ ఫీడ్ సపోర్ట్ వంటివి దీంట్లో లభిస్తాయి.
7.Lawnchair Launcher 2
ఫోన్ వీలైనంత హడావిడి లేకుండా కనిపించాలని భావించేవారికి ఈ లాంఛర్ బాగా ఉపయోగపడుతుంది. అడాప్టివ్ ఐకాన్లు, థర్డ్-పార్టీ ఐకాన్లకు సపోర్ట్, గూగుల్ నౌ ఇంటిగ్రేషన్ వంటివి దీంట్లో ఉంటాయి.
8.Lightning Launcher
చాలా లైట్ వెయిట్ గా ఉండే లాంఛర్ ఇది. హోం స్క్రీన్ లో ఉండే అన్ని అంశాలను దీని సహాయంతో మార్చుకోవచ్చు. అలాగే వివిధ సందర్భాలకు తగ్గట్లు భిన్నమైన హోమ్ స్క్రీన్లని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ సహకారంతో లాంఛర్‌ని మీకు నచ్చినట్లు మరింత మార్పిడి చేసుకోవచ్చు. అదనంగా ప్లగిన్ సపోర్ట్, లాంగ్వేజ్ ప్యాక్‌లు వంటివి కూడా లభిస్తాయి.
9.Microsoft Launcher
మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా విడుదల చేసిన ఈ లాంచర్ దాదాపు అన్ని మైక్రోసాఫ్ట్ సర్వీసులతో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. క్యాలెండర్, ఈమెయిల్, plan for the day వంటి సదుపాయాలతో పాటు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లతో ఇది ఇంటిగ్రేట్ చేయబడుతుంది. విండోస్ డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కలిగి ఉండి, ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారికి ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగపడే లాంఛర్.
10.Nova Launcher
సుదీర్ఘకాలంగా మార్కెట్లో ఉన్న లాంఛర్ ఇది. జెశ్చర్ సపోర్ట్, అప్లికేషన్ యొక్క లుక్ మరియు ఫీల్ మనకు నచ్చినట్లు modify చేసుకునే వెసులుబాటు, ఐకాన్ ప్యాక్ సపోర్ట్, థీమ్ సపోర్ట్ వంటి భారీ మొత్తంలో సదుపాయాలు దీంట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఈ లాంఛర్. అలాగే హోం స్క్రీన్ లేఅవుట్ మొత్తాన్ని బ్యాక్అప్ తీసుకునే సదుపాయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఇంతకు ముందు వాడిన హోమ్ స్క్రీన్ లేఅవుట్ తిరిగి పొందడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
Comments
Post a Comment